ఎల్‌వీ ప్రసాద్ మనవడిపై పోలీసుల‌కు ఇళ‌య‌రాజా ఫిర్యాదు

01-08-2020 Sat 11:39 | Entertainment
  • ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించారని ఫిర్యాదు
  • పలు పరికరాలను ధ్వంసం చేశారని ఆరోపణ
  • తనపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి, అతడి అనుచరులు ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించి సంగీత వాయిద్యాలతో పాటు ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.

ప్ర‌సాద్ స్టూడియోస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్వీ ప్ర‌సాద్ తనపై గౌర‌వంతో స్టూడియోలో ఇచ్చిన ప్ర‌త్యేక‌మైన గ‌ది ఉన్న స్టూడియో స్థలం గురించి వివాదం రాజుకున్న నేపథ్యంలో తాను సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. అయితే, ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, బలవంతంగా స్టూడియోలోని ఆ స్థలాన్ని లాక్కోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు.

సాయి ప్రసాద్‌తో పాటు అతడి అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా కోరారు. కాగా, ఇళయరాజాకు ఎల్వీ ప్రసాద్  ఇచ్చిన రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దీనిపై ఎల్వీ ప్రసాద్‌ కుమారుడు రమేశ్ ప్రసాద్‌ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. మనవడు సాయి ప్రసాద్ మాత్రం దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు జరుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను బెదిరిస్తున్నారంటూ ఇళ‌య‌రాజా సాయి ప్ర‌సాద్‌పై మ‌రోసారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
ilayarajaPoliceTamilnadu

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more